Share News

సింగరేణిని పరిరక్షణకు కార్మికులు ఉద్యమించాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:07 AM

సింగరేణిని రక్షించు కోవడానికి కార్మికవర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం ఓసీపీ-1 సీహెచ్‌పీ ఆవరణలో జరిగిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు.

సింగరేణిని పరిరక్షణకు కార్మికులు ఉద్యమించాలి

యైుటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సింగరేణిని రక్షించు కోవడానికి కార్మికవర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నట్టు సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం ఓసీపీ-1 సీహెచ్‌పీ ఆవరణలో జరిగిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు. సంస్థ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరగడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలిపారు. సింగరేణి నిధులను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు దారి మళ్ళిస్తున్నాయని, సంస్థకు రావాల్సిన 50 వేల కోట్లు ఇవ్వకపోవడంతో ఆర్థిక కష్టాలు పడాల్సి వస్తున్నట్టు సత్తయ్య తెలిపారు. నైనీ బ్లాక్‌ ద్వారా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నదన్నారు. సంస్థ మనుగడకు ఎంతో ఉపయోగడుతుందని, రాష్ట్ర మంత్రుల వాటాల పంపిణీలో ముసలంతో నైనీ బ్లాక్‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టు సత్తయ్య ఆరోపించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికార పార్టీ, గెలిచిన సంఘాలు కాలయాపన చేస్తున్నట్టు విమర్శించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, నాయకులు వేణుగోపాల్‌రావు, మాదాసి రవీందర్‌, జబ్బర్‌లాల్‌, నర్సయ్య, సంతోష్‌, కృష్ణ, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:07 AM