Share News

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:58 PM

సింగ రేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్క రించాలని లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్‌, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ఆర్జీ వన్‌ ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్లు, ఓసీపీ-5 లలో ధర్నాలు నిర్వహించి డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజే శారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

గోదావరిఖని, మార్చి 17(ఆంధ్రజ్యోతి): సింగ రేణిలో కార్మికుల పెండింగ్‌ సమస్యలను పరిష్క రించాలని లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్‌, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ఆర్జీ వన్‌ ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్లు, ఓసీపీ-5 లలో ధర్నాలు నిర్వహించి డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజే శారు. వారు మాట్లాడుతూ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 51వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు కేటాయించాలని, ఏసీబీ విచారణ పేరుతో నిలిపి వేసిన మెడికల్‌ బోర్డును వెంటనే నిర్వహిం చాలని వారు డిమాండ్‌ చేశారు. అదే విధంగా సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌ కంటాక్స్‌ యాజమాన్యం చెల్లించాలని, మారుపేర్లు, విజిలెన్స్‌ కేసుల కార్మికుల డిపెండెంటులకు ఉద్యోగాలు ఇవ్వాలని, డిస్మిస్‌ కార్మికులకు ఒక సారి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అదే విధంగా సింగరేణిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 18 నుంచి 30 వరకు సేవ్‌ సింగరేణి పేరుతో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు పోరు జాత నిర్వహించి హెడ్‌ ఆఫీస్‌ను ముట్టడిస్తామని, ఇందులో భాగంగా ఈ నెల 22న గోదావరిఖనికి పోరు జాత వస్తుందని, గోదావరి బ్రిడ్జి నుంచి చౌరస్తా వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌ను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుంటే ఏప్రిల్‌లో సమ్మెకు పిలుపునిస్తామి హెచ్చరించారు. ఏఐటీయూసీ ఆర్‌జీ-1 బ్రాంచి ఆఫీస్‌ బేరర్స్‌తో పాటు ఫిట్‌ కార్యదర్శులు సంకె అశోక్‌, మాదన మహేష్‌, సిద్దమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్‌, ఎస్‌ వెంకట్‌ రెడ్డి, గండి ప్రసాద్‌, చెప్యాల భాస్కర్‌, దాసరి అనిల్‌, కే విజయలక్ష్మి, దొంత సాయన్న, ఎం చక్రపాణి, ఎంఏ గౌస్‌, కలవేణి రాజేష్‌, వేముల అశోక్‌, సత్యనారాయణ, చంద తిరుపతి, బిట్టి వెంకటేశ్వర్లు, ఆఫీస్‌ కార్యదర్శి తొడుపునూరి రమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:58 PM