ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయండి...
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:15 AM
రామగుండంలో కొలువుదీరిన పాలకవర్గం ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రామగుండంలో కొలువుదీరిన పాలకవర్గం ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు. పార్టీ విధేయత, అనుభవం, ఇతర సమీకరణలను దృష్టిలో ఉంచు కొని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. తాము ఆర్థికంగా ఉన్నా లేకున్నా అవకాశం ఇచ్చామని, సీనియర్ లీడర్లు తమకు తామే గెలిచినట్టు అనుకోవద్దని, కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్ర మాలు, కార్యకర్తల కృషి ఈ విజయంలో ఎంతో ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం డివిజన్లను పెంచామని, తద్వారా మైక్రో లెవల్‌లో సమస్యలకు పరిష్కారం లభిస్తుం దన్నారు. కార్పొరేటర్లు అవినీతికి తావులేకుండా వ్యవహరిం చాలని, అధికారులపై జులుం, బ్లాక్‌మెయిల్, కులాలతో ప్రయోగాలు చేయవద్దన్నారు. అధికారులను కాంట్రాకర్లు, కార్పొరేటర్లు బెదిరిస్తే ఇబ్బందులు పడతారన్నారు. అధికారులపై జులుం చేస్తే కార్పొరేటర్లు కలెక్టర్ డిస్మిస్ చేసే అధికారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కార్పొరేటర్లు నేనే రాజు, నేనే మంత్రి అనేభావనతో ఉం డవద్దని, ఇంటి ముందు కుర్చీలు వేసుకుని కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్క రించాలన్నారు. రామగుండం సౌలభ్యం కోసం జోన్లుగా విభజించారే తప్ప యైుటింక్లయిన్, ఎన్‌టీపీసీ, రామగుండం, గోదావరిఖని వేర్వేరు ప్రాంతాలు కావని, ఒక్కరే కార్పొరేషన్ అన్నారు. ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఎంతో సహకరిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో కొత్తగా విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని, మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు అనేక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ప్రతి డివిజన్‌లో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.