వీబీజీరామ్‌జీ పథకంలో పనులు గుర్తించాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:43 AM
గ్రామపంచాయతీలో వీబీజీరామ్‌జీ పనుల్లో 4 కేటగిరిల్లో 375 పనులను గుర్తించాలని జడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
రామగిరి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలో వీబీజీరామ్‌జీ పనుల్లో 4 కేటగిరిల్లో 375 పనులను గుర్తించాలని జడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై జిల్లా స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 2027-28లో చేపట్టే పనులకు సంబంధించి గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. నీటి భద్రత, గ్రామాల్లో మౌలిక వసతులు, చిన్నసన్నకారు రైతులకు జీవనోపాధి కల్పించే పనులు, విపత్తు నిర్వహణ సమయంలో రక్షణ చర్యలపై ప్రధానంగా పనులు జరగాలని సూచించారు. గ్రామాల్లో వీటిపైనే అధికారులు, సర్పంచ్‌లు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఎప్పకప్పుడు పనుల పై సమీక్ష సమావేశాలు మండల, గ్రామస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. డిఆర్‌డివో కాళిందిని, ఆర్‌డబ్ల్యూ డిఈఈ శ్రీనివాస్, అడిషనల్ డిఆర్‌డివో మల్లేష్, జిల్లా హర్టికల్చర్, ఫిషరీస్, జిల్లాలోని 13 మంది ఎంపీడీవోలు,ఏపివోలు, ఈసీలు, టీఏలు, సర్పంచ్‌లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.