Share News

ఏఈవోలపై పని ఒత్తిడి తగ్గించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:20 AM

వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలపై పనిభారం తగ్గించాలని శుక్రవారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌కు జిల్లా ఏఈవోలు వినతిపత్రం అందించారు.

ఏఈవోలపై పని ఒత్తిడి తగ్గించాలి

పెద్దపల్లి రూరల్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలపై పనిభారం తగ్గించాలని శుక్రవారం బ్రాహ్మణపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌కు జిల్లా ఏఈవోలు వినతిపత్రం అందించారు. పలువురు ఏఈవోలు మాట్లాడు తూ ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌, పీఎం కిసాన్‌, రైతు బీమా, రైతుల ఫోన్‌ నంబర్‌ మార్పులు, ప్రకృతి వ్యవసాయం, రైతు విశిష్ట కార్డు వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఈవో లపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించి, డిజిటల్‌ పంటల సర్వే వెరిఫికేషన్‌ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:20 AM