Share News

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:44 PM

మహిళలు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రి వద్ద ఉన్న షాదీఖానా భవనంలో ఇందిరమ్మ మహిళ శక్తి ఆధ్వర్యంలో 300మందికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పిలుపునిచ్చారు. గురువారం గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రి వద్ద ఉన్న షాదీఖానా భవనంలో ఇందిరమ్మ మహిళ శక్తి ఆధ్వర్యంలో 300మందికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కాళ్లపై నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఇంటి వద్దే ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు. మహిళల అభ్యున్నతి, సంక్షేమం, స్వయం ఉపాధికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వం అర్హులైన లబ్దిదా రులందరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తుందని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిం చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, డ్వాక్రా స్వశక్తి మహిళా గ్రూపుల ద్వారా పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి కృషి చేస్తునట్టు చెప్పారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా, నాయకులు కాల్వ లింగస్వామి, ఆసిఫ్‌ పాషా, మారెల్లి రాజిరెడ్డి, కార్పొరే టర్లు ఫజల్‌బేగ్‌, సాగి సంతోష్‌రావు, గట్ల రమేష్‌, దూళికట్ట సతీష్‌, యుగం ధర్‌, సాంబమూర్తి, స్వప్న, నిర్మలాదేవి, పద్మావతి, కంకణాల మౌనికతో పాటు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:44 PM