Share News

క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 13 , 2026 | 12:02 AM

క్యాన్సర్‌పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఆర్‌జీ-1 సింగరణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జీవీటీసీ ఆవరణలో మహిళలకు క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.

క్యాన్సర్‌పై మహిళలు అప్రమత్తంగా ఉండాలి

గోదావరిఖని, మే 12(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఆర్‌జీ-1 సింగరణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జీవీటీసీ ఆవరణలో మహిళలకు క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. సమాజంలో క్యాన్సర్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తుందని, మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అకస్మాత్తుగా శరీరంపై గడ్డలు ఏర్పడడం, చర్మం రంగు మారడం, నీరసం, అలసటగా ఉండడం వంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిం చాలని, క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చన్నారు. వైద్యురాలు సాహిత్‌రెడ్డి, జీవీటీసీ మేనేజర్‌ మాధవరెడ్డి, మురళీకృష్ణ, లేడిస్‌ క్లబ్‌ సెక్రటరీ శిరీష, సభ్యులు అంజలి, రజిత, కళ్యాణి పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:02 AM