Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:42 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళళ మల్లయ్య పేర్కొన్నారు. బస్టాండ్‌ ఆవరణలో మంగళవారం మహాలక్ష్మీ పథకం సంబురాలు నిర్వహించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

పెద్దపల్లిటౌన్‌, మార్చి 31 (ఆంఽధ్రజ్యోతి) కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళళ మల్లయ్య పేర్కొన్నారు. బస్టాండ్‌ ఆవరణలో మంగళవారం మహాలక్ష్మీ పథకం సంబురాలు నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతీ మహిళను కోటేశ్వరాలుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, వారి కోసం అనేక పథకాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశ పెడుతున్నారన్నారు. ఇప్నటివరకు 290 కోట్ల మంది మహిళలు ఉచిత బస్‌ ప్రయాణం చేశారని, దీని ద్వారా మహిళలకు పదివేల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, కౌన్సిలర్లు మొలుగూరి కమల్‌, సరస్వతి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, రవీందర్‌, గోదావరిఖని డిపో మేనేజర్‌ నాగభూషణం, స్వప్న మున్సిపల్‌ సిబ్బంది,సెర్ఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:42 PM