రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:52 PM
రైతులు కాం గ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నిం చారు. జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రైతులు కాం గ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నిం చారు. జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. వరి కొనుగోలు చేసినందుకా.. రైతుబంధు వేసినందుకా.. రెండు లక్షల రుణమాఫీ చేసినందుకా.. రైతు బీమా ఎత్తి వేసినందుకా.. సకాలంలో ఏ ఇబ్బం దులు లేకుండా ఎరువులు పంపిణీ చేసినందుకా.. ఎందు ఓటు వేయాలో రేవంత్‌రెడ్డి చెప్పాలని సవాల్ విసిరారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న నెలల పాటు కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడ్డార న్నారు. రైతుబంధు మూడు పంటలకు ఎగవేశాడని, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, ఆపై ఉన్న రుణం రైతులు చెల్లించుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి రెండు లక్షల లోపు, రెండు లక్షలపైన ఏవీ రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరా రని, పోలీసుల లాఠీచార్జీల మధ్య ఎరువులు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నిం చారు. కేసీఆర్ హయాంలో ఎరువుల కోసం ప్రత్యేక గోడౌన్లు కట్టించి పంపిణీ చేశామన్నారు. మూడు వేల మంది రైతులు చనిపోతే రైతుబీమా అందించలేద న్నారు. మా ప్రభుత్వంలో రైతు చనిపోతే వారం రోజు ల్లో 5 లక్షల రూపాయలు అందించిన ఘనత మాకే దక్కిందన్నారు. మక్కలు కొనుగోలు కేంద్రంలోనే ఉం డగానే ఎత్తి వేశారని, 24 గంటలు ఉచిత కరెంటు అని చెప్పి కేవలం 13 గుంటలే అందిస్తున్నారని ఆయన వివరించారు. జీవో నెంబర్ 8తో రైతు డిస్కంల పేరు చెప్పి సోలార్ పవర్‌ను ప్రొత్సహించడంతో కేవలం 8 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుందని హరీ ష్‌రావు పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు, ఆర్టీవో చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపాడన్నారు. ప్రజలను ఊచకోతలు కోసి ఆగం చేసిన హిట్లర్ పేరు చెప్పుకుం టున్న రేవంత్‌రెడ్డి నీవు తలకిందులైనా ఇక రాష్ట్రంలో నీవు గెలువవని స్పష్టం చేశారు. పోలీసులు అత్యుత్సహం చూపుతున్నారని ఇంకా రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని, కష్టకాలంలో ఉన్న కార్యక ర్తలను, నాయకులను గుండెల్లో పెట్టుకొని చూసుకుం టామని హామీ ఇచ్చారు. రానున్న రోజులు మనవేనన్న సంగతి మరిచి పోవద్దన్నారు. మాజీ మం త్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, సిరిముల్ల రాకేష్, గంట రాములు, మర్కు లక్ష్మన్, రఘువీర్‌సింగ్, ఈద శంకర్‌రెడ్డి సీఎస్సార్, ఉప్పు రాజ్‌కుమార్, పెంచాల శ్రీధర్, ఫహీం, నూగిళ్ళ వీరేష్, తదితరులు పాల్గొన్నారు.