Share News

సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:13 AM

ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని, వాటి ఫలాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి

కోల్‌సిటీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని, వాటి ఫలాలు అర్హులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల ప్రణాళిక ప్రారంభ కార్యక్రమాన్ని శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు సకా లంలో పూర్తవడంతోపాటు సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక షెడ్యూల్డ్‌ ప్రకారం ఈనెల 15వరకు తొలుతగా నిర్వహిస్తున్న స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. నగరంలో శానిటేషన్‌ మెరుగుపర్చడంలో వార్డు అధికా రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వార్డు అధికారులు మెరుగ్గా పనిచేస్తే ప్రజా ప్రతినిధులపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు మేలు చేయాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. డివిజన్లలో మున్సిపల్‌ సేవలు అందించడంలో వార్డు అధికారులే కీలక పాత్ర పోషించాలన్నారు. సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి నగరాన్ని పరిశుభ్రతతో అద్భుతనగరంగా తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం తన బాధ్యత అని పేర్కొన్నారు. మహిళ సాధికారికతపై దృష్టి సారించాలని సూచించారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా సహకారం అందించాలన్నారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండం నగరంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక సమర్థంగా అమలు చేయడానికి రోజువారి షెడ్యూల్‌ రూపొందించినట్టు చెప్పారు. షెడ్యూల్డ్‌ ప్రకారం పరిసరాల పరిశుభ్రతతో పెండింగ్‌ ఫైల్స్‌ క్లియరెన్స్‌ చేపడుతామన్నారు. శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రోడ్లు, కూడళ్లు శుభ్రం, మురుగు నీటి కాలువల్లో పూడికతీత, స్వచ్ఛ వాహనాల మరమ్మతు, కార్యాలయం శుభ్రత, ప్రజల్లో అవగాహన రూపొందించడానికి 2కే రన్‌ తదితర కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రతి కార్పొరేటర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్పొరేటర్లు, వార్డు ఆఫీసర్లు సమన్వ యంతో పని చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరే టర్లు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది, మెప్మా ఆర్‌పీలతో ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ మౌనిక పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:13 AM