అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:58 PM
అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలోని అమర్‌చంద్ కళ్యాణ మండపంలో మంగళవారం 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలోని అమర్‌చంద్ కళ్యాణ మండపంలో మంగళవారం 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే బస్సు డిపో, బైపాస్ రోడ్డు, సర్కార్ దవఖాన తదితర అభివృద్ధి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అవినీతికి తావు లేదని పాలన అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందామని అందుకు ఇటీవల జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగ్గిళ్ల మల్లయ్య, వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ నాయ్యర్, మార్కెట్ చైర్మన్ మల్లారెడ్డి, తహసీల్దార్ రాజయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు 80 శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేసి అధికారాన్ని కట్టబె ట్టారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన అందిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్య క్రమంలో 99 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లా డుతు చైర్మన్లు, కౌన్సిలర్లు ఎదిగిన కొద్ది ఒదిగి ఉండా లని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయా లన్నారు. ఒకప్పటి సమితి, తాలూకా కేంద్రంగా విరా జిల్లిన సుల్తానాబాద్‌కు గత వైభవం చేకూరుస్తామని, ఇది మనందరికి విద్యను బుద్దిని నడవడికను ఇచ్చిన ఊరన్నారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, మార్కెట్ చైర్మన్ మిను పాల ప్రకాష్‌రావు, గాజుల రాజమల్లు, తహసీల్దార్ బషీరొద్దిన్, సర్సంచుల ఫోరమ్ అధ్యక్షుడు నామిని రాజిరెడ్డి, సర్పంచ్‌లు ఉప్పు లక్ష్మి, కాంపల్లి సతీష్, ఓగుల పూజ, కర్రె కవిత, స్రవంతి, వీరగోని రమేష్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నారాయణపూర్ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ గుడి నిర్మించుకున్న గౌడ కులస్తులను అభినందిస్తూ దేవాలయం ప్రహరీకి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎంపీటీసీ మండల రమేష్, కొండల్ రావు, మాధవ రావు, బుర్ర బాణయ్య, బాలసాని శ్రీనివాస్,మూల హరీష్, సురేష్, మల్లిఖార్జున్, పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా పాలన అందించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సర్పంచ్‌లకు పెద్దబొంకూర్ మదర్‌థెరిస్సా ఇంజ నీరింగ్ కళాశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం శిక్షణ ముగింపు కార్యక్ర మానికి ఎమ్మెల్యే హాజరై ధ్రువీకరణ పత్రాలు అందిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తా రన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్, భూమి ఉండి ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కల్యాణలక్ష్మీ, అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డిఎల్‌పీవో దేవకీదేవితోపాటు ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు.