Share News

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:50 PM

పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు.

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు

జూలపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకపోతుందని, అర్హులైన పేదలందరికి పథ కాలు అందజేస్తామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. అబ్బాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం మంత్రి, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణా రావుతో కలిసి ప్రారంభించారు. సర్పంచ్‌ దండె వెంకటేశం, పాలకవర్గ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. మంత్రి లక్ష్మణ్‌కు మార్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరు పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పేదలందరికి రేషన్‌ కార్డులను మంజూరు చేసి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. అబ్బాపూర్‌ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అనాలోచిత విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం రైతులకు సాగునీరు అందక ఎలాంటి ప్రయోజ నాలు లేకుండా పోయాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో రైతు లకు ఎలాంటి కోతలు లేకుండా చేశామని, తూకం వేసిన ధాన్యం డబ్బు లను ఖాతాల్లో జమ చేశామన్నారు. సర్పంచ్‌ దండె వెంకటేశం, ఉపస ర్పంచ్‌ అమరాజి మమత, వార్డు సభ్యులు పబ్బాల శంకరయ్య, బొడిగె లక్ష్మన్‌, తహసీల్దార్‌ దత్తు ప్రసాద్‌రావు, ఎంపీడీవో పద్మజ, విండోచైర్మెన్‌లు లోక జలపతిరెడ్డి, పుల్లూరివేణుగోపాల్‌రావు, నాయకులు నల్లాల కనక రాజు, జెట్టి సతీష్‌, బండి స్వామి పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 11:50 PM