Share News

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:45 PM

గ్రామ,వార్డు సభల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవా రం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలె క్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పెద్దపల్లి, జూన్‌ 2 (ఆంఽధ్రజ్యోతి): గ్రామ,వార్డు సభల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవా రం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలె క్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం చివరి దశకు చేరుకుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్యక్ర మం ముగింపు వేడుకలను ఈ నెల 4, 6, 8, 10వ తేదీ ల్లో జిల్లాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్య లు చేపట్టాలని తెలిపారు. గ్రామాలు, మున్సిపల్‌ వార్డు లు, కార్పొరేషన్‌ డివిజన్లలో గ్రామ, వార్డుసభలు నిర్వ హించాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధిం చిన కాలువల అభివృద్ధి, సాగునీటి పనుల పురోగతిని గ్రామ సభలలో చర్చించాలని తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో గ్రామ సభలు పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత రాకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని, ఎరువుల బుకింగ్‌ యాప్‌ పై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎరు వుల నిల్వలు, డీలర్ల గోదాములపై నిరంతర తని ఖీలు నిర్వహించాలని, నానోయూరియా వినియోగాన్ని ప్రోత్స హించాలని సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణ కు కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయ తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో మురుగు కాల్వల శుభ్రత, తాగునీటి పరిరక్షణ చర్య లు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ మాట్లా డుతూ వాతావరణశాఖ అంచనాల ప్రకా రం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో లోటు వర్షపా తం నమోదయ్యే అవకాశం ఉందని తెలి పారు. జిల్లాల వారీగా ప్రత్యా మ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి కందులు, జొన్నలు, ఉలవలు, మొక్కజొన్న, శనగలు, మినుములు, పెసర్లు, ఆయిల్‌పామ్‌, కూరగా యలు, పండ్ల తోటల సాగు వైపు రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు. కలెక్టర్‌ కోయశ్రీహర్ష, డీసీపీ రాం రెడ్డి, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జడ్పీసీఈఓ నరేందర్‌, ఎస్‌ఈ గంగాధర్‌, డీఎల్‌ పీఓ దేవకీదేవి పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:45 PM