Share News

శ్రీపాదరావు ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తాం

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:30 AM

మంథని నియోజకవర్గ ప్రజలందరికి సేవ చేయాలని, విద్య, వైద్య, రవాణా, తాగు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలను కల్పించాలని జీవితాంతం తపన పడిన తన తండ్రి మాజీ శాసన సభా స్పీకర్‌ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.

శ్రీపాదరావు ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తాం

మంథని, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గ ప్రజలందరికి సేవ చేయాలని, విద్య, వైద్య, రవాణా, తాగు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలను కల్పించాలని జీవితాంతం తపన పడిన తన తండ్రి మాజీ శాసన సభా స్పీకర్‌ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. మాజీ స్పీకర్‌ దుద్దిళ్ళ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పూల మాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. శ్రీపాదకాలనీలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. శ్రీపాదరావు స్ఫూర్తితో ప్రజాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లో పని చేస్తామన్నారు. తన తండ్రి శ్రీపాదరావు ఆశయాలను కొనసాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మంచి పేరు తీసుకు వస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్‌ శ్రేణుల లక్ష్యాన్ని ఎవరు ఆపలేరన్నారు. అనవసరంగా రాజకీయ విమర్శలు చేసే వారిని పట్టిచుకోమన్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. శ్రీపాదరావు రాజకీయ జీవితం ప్రజా సేవ చేయాలనే వారికి ఆదర్శప్రాయమన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసిన భౌతికంగా దూరమైన ఇన్నేళ్ళు ప్రజల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఐలి ప్రసాద్‌, వొడ్నాల శ్రీనివాస్‌, శశిభూషణ్‌కాచే, ముస్కుల సహేందర్‌రెడ్డి, సెగ్గెం రాజేష్‌, కొత్త శ్రీనివాస్‌, కొండ శంకర్‌, ముస్కుల సురేందర్‌రెడ్డి, కుడుదుల వెంకన్న, పేరవేన లింగయ్యయాదవ్‌, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

రైతుల ఇబ్బందుల లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కేంద్రాల వద్ద సౌకర్యవంతంగా కొనుగోళ్ళు చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మార్కెట్‌ యార్డులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటిక కప్పుడు ధాన్యాన్ని రైస్‌ మిల్లుకు పంపాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, శశిభూషణ్‌కాచే, కొత్త శ్రీనివాస్‌, ఎక్కేటి అనంతరెడ్డి, సురేష్‌, ఐలి ప్రసాద్‌, పీఏసీఎస్‌ ప్రత్యేక అధికారి అనిల్‌కమార్‌, కార్యదర్శి మామిడాల అశోక్‌లు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:30 AM