Share News

డీలిమిటేషన్‌ లేకుండా మహిళా బిల్లుకు మద్దతిస్తాం

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:34 PM

మహిళా బిల్లు సాకుగా చూపిస్తూ డీలిమిటేషన్‌ బిల్లు అమలు చేయా లని బీజేపీ కుట్రపన్నిందని, డీలిమిటేషన్‌ లేకుండా మహిళా బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుం దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం మం డల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

డీలిమిటేషన్‌ లేకుండా మహిళా బిల్లుకు మద్దతిస్తాం

ధర్మారం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లు సాకుగా చూపిస్తూ డీలిమిటేషన్‌ బిల్లు అమలు చేయా లని బీజేపీ కుట్రపన్నిందని, డీలిమిటేషన్‌ లేకుండా మహిళా బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుం దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం మం డల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి నేనే రాజు నేనే మంత్రి 10 ఏండ్లు బీఆర్‌ఎస్‌ పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ఇంజనీర్‌ అవతారమెత్తిన కేసీఆర్‌ కాళేశ్వ రాన్ని కుప్పకూల్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్‌ మట్లాడున్న వైఖరి తనను బాధకు గురిచేస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మాట్లాడేవి వేల కోట్లు దోచుకున్న అక్రమ సంపాదన అహం మాటలని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని మంత్రి అడ్లూరి హెచ్చరించారు. ముందు మీ ఇంటి తోబుట్టువు అడుగు తున్న ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 40 ఏండ్లు పార్టీ చేయి నీడలో బతికి, ఇప్పుడు ఆ చేయినే నరికేస్తానని జీవన్‌రెడ్డి మాట్లాడడం సబబుకాదన్నారు. దోచుకున్న సొమ్ముతో జగిత్యాలలో నిర్వహించే సభ కేసీఆర్‌ బహిరంగ సభనా, జీవన్‌రెడ్డి చేరిక సభనా చెప్పాలని ప్రశ్నిం చారు. సోమవారం జరగబోయే మేడిగడ్డ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నేడు రైతుభరోసా రెండో విడుత నిధులను ప్రభుత్వ విడుదల చేస్తుందని సంతోషం వ్యక్తంచేశారు. అంతకు ముందు మంత్రి కళ్లెంరెడ్డిపల్లిలో పర్యటించారు. గ్రామస్తులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్క రించాలని ఆదేశించారు. గ్రామంలో విద్యుత్‌ సమస్య పరిష్కారంతోపాటు రేషన్‌ దుకా ణాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్‌ రూప్లానాయక్‌, వైస్‌ చైర్మెన్‌ అరిగె లింగయ్య, డీసీసీ జనరల్‌ సెక్రెటరీ తిరుపతిరెడ్డి, డీసీసీ సెక్రెటరీ కొత్త నర్సింహులు, ధర్మపురి నియోజక వర్గ యూత్‌ అధ్యక్షుడు అశోద అజయ్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షు డు రంజిత్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కొడారి అంజన్న, దేవి జనార్దన్‌, కాడె సూర్యనారాయణ, చిరం జీవి, మహిళా నాయకురాలు దేవిలావణ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:34 PM