గాలివాన బాధితులను ఆదుకుంటాం
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:32 PM
గాలి వాన బీభత్సం వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. ధర్మారం మండలంలో ఆదివారం గాలివానతో దెబ్బతిన్న పలు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. బాధితులు బాధపడవద్దని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు.
ధర్మారం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): గాలి వాన బీభత్సం వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ ఆదుకుంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. ధర్మారం మండలంలో ఆదివారం గాలివానతో దెబ్బతిన్న పలు ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. బాధితులు బాధపడవద్దని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు. మండల కేంద్రంలో గాలికి ఎగిరి వచ్చి రోడ్డు పై పడిన టేలాలతో పాటు, చర్చిలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అనంతరం పెద్దమ్మ గుడి ప్రాంగణంలో ధ్వంసం అయిన రేకులను చూశారు. వ్యవసాయ మార్కెట్‌లో తడిచిన మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ధాన్యం తడిచిన, మొలకెత్తిన ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులెవ్వరూ అధైర్య పడవద్దని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్ మాట్లాడి లారీలను సమకూర్చాలని, సోమవారం సాయంత్రంలోగా వ్యవసాయ మార్కెట్లో నుండి ధాన్యాన్ని పూర్తిగా తరలించాలని ఆదేశించారు.
అవినీతికి పాల్పడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
పదవి కాలంలో వంద రూపాయల అవినీతికి పాల్పడిన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి నియోజక వర్గంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని ఇటీవల మాజీ మంత్రి కొప్పుల సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇసుక మాఫియాకు అడ్డుగా ఉన్నానని నేరెళ్ల రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇంటో కూర్చోని సోషల్ మీడియాలో మాట్లాడితే నియోజకవర్గ ప్రజల బాగోగులు కొప్పులకు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మెన్ అరిగె లింగయ్య, పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, యూత్ కాంగెస్ నియోజక వర్గ ఇంచార్జ్ యశోద అజయ్, సీనియర్ నాయకులు కొడారి అంజన్న, ద్యాగేటి ఉదయ్, దేవి జనార్దన్, పాలకుర్తి రాజేశం, కాడె సూర్యనారాయణ, సోగాల తిరుపతి, ఈదుల శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.