దసరా నాటికి సొంతిల్లు అందజేస్తాం
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:57 PM
దసరా పండుగ నాటికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసి, అర్హులైన లబ్ధిదా రులకు సొంతింటి తాళాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. మం గళవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పను లను లబ్ధిదారులతో కలిసి మేయర్ పరిశీలిం చారు
జ్యోతినగర్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నాటికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసి, అర్హులైన లబ్ధిదా రులకు సొంతింటి తాళాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. మం గళవారం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పను లను లబ్ధిదారులతో కలిసి మేయర్ పరిశీలిం చారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీ లించిన ఆయన సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడారు. మిగిలిన పనులను వేగవం తంగా పూర్తిచేసి, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇళ్లను అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులతో మేయర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతీ లబ్ధి దారుడికి డబుల్ బెడ్రూం ఇల్లు అందిం చడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తు న్నామని తెలిపారు. లబ్ధిదారుల సొంతింటి కలను సాకారం చేయడంపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొ న్నారు. పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, అధి కారులతో సమీక్షిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచిస్తున్నారని తెలి పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు దసరా పండుగను సొంతింటిలో జరుపుకు నేలా నిర్మాణ పనులను పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, వెంగల బాపు, రమేష్, ధూళికట్ట సతీష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.