Share News

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:59 PM

రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్‌లో నిర్మించిన డార్మెటరీ హాల్‌తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు.

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

ఓదెల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్‌లో నిర్మించిన డార్మెటరీ హాల్‌తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు. విప్‌ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్నారు. జీలకుంటలో మహిళా సంఘం భవన నిర్మా ణానికి 2.5 గుంటల స్థలాన్ని ఇచ్చిన దివంగత కొట్టే మల్లారెడ్డి త్యాగాన్ని కొనియాడారు. ఈ భవనానికి భూదాత మల్లారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కాంపౌండ్‌ వాల్‌, మెట్లు, టాయిలెట్ల నిర్మా ణానికి అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలి పారు. ఈ పనులను దసరా వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జీలకుంట నుంచి పందిల్ల రోడ్డు పనులను త్వరలోనే బీటీ రోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా నిర్మిస్తున్న కాంపౌండ్‌ వాల్‌ పనులను రెండు నెలల్లో పూర్తి చేయిస్తామన్నారు. అలాగే పెద్దపల్లి కి వచ్చే ప్రధాన రహదారి పనులను పూర్తి, పొత్క పల్లిలోని కూడళ్లలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తా మని స్పష్టం చేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహా యాన్ని ఎమ్మెల్యే వివరించారు.

గతంలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందిపడేవారని, తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత కాల్వల ద్వారా నీరు అందించడం వల్ల మొక్కజొన్న, వరి దిగుబడి అధికంగా రావడం సంతోషకర మన్నారు. ఇల్లు లేని ప్రతీ అర్హునికి ఇం దిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. సర్పంచులు రాగిడి మంగ, శ్రీనివాస్‌ రెడ్డి, కనికి రెడ్డి సతీష్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పిట్టల రవికుమార్‌, అధి కార ప్రతినిధి బైరి రవి గౌడ్‌, బోడకుంట శంకర్‌, విజ యేం దర్‌ రెడ్డి,నాగపూరి రవి గౌడ్‌, కుమార స్వామి, వంగ రాజమల్లు,గుండేటి ఐలయ్య,తిర్తాల వీరయ్య, నరేష్‌, నర్సింగం, కృష్ణ,మీనుగు సంతోష్‌,రాకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:59 PM