Share News

ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:33 AM

ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రజా సమ స్యల పరిష్కారానికి వారంలో మూడు రోజలు ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో చేయుత పెన్షన్‌ మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్నారు.

ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం

ధర్మారం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రజా సమ స్యల పరిష్కారానికి వారంలో మూడు రోజలు ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలో చేయుత పెన్షన్‌ మంజూరు పత్రాల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొ న్నారు. మండలం వ్యాప్తంగా మంజూరైన 733 లబ్ధిదారులకు చేయూత పెన్షన్‌ పత్రాలను అం దజేసి మాట్లాడారు. మూడు సంవత్సరాల పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు లో ప్రభుత్వ విజయవంతమైందన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో పెన్షన్‌ పెంపుతో పాటు మహాలక్ష్మీ పథకాన్ని అమలుకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్శయంతో ఉన్నారని తెలిపారు. పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ఒక్క రికైన పెన్షన్‌ మంజూరు చేసిందా, అల్లుడత్తే ఏడ పడుకుంటాడు, గొర్లు మేకలు ఏడ కట్టేసు డని కబుర్లు చెప్పిన కేసీఆర్‌ మండలంలో ఏ ఒక్కరికైనా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు మంజూరు చేశాడా అని ప్రశ్నించారు. మండలంలో 648 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో 5 లక్షల రూపాయలు జమచేశామని పేర్కొన్నారు. ధర్మపురి నియో జకవర్గానికి మరో రెండు వేల ఇందిరమ్మ ఇం డ్లు మంజూరు చేస్తామని, అవసరమైతే స్థలం చూపించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిం చి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రాజారాం పల్లిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నా మని, ప్రజలు తనను నేరుగా కలవొచ్చని తెలి పారు. గ్రామాల్లో అర్హులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులదే అన్నారు. అర్హులైన వారికి పథకాలు అందకుంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంపు గ్రామమైన చామనపల్లి 350 కోట్లు కేటాయించ డంతో పాటు పుష్కరాలకు 226 కోట్లు మం జూరు చేయించానని తెలిపారు. డీఆర్‌డీఓ వేముల మల్లేశం, ఏడీఆర్‌డీఓ ఎస్‌.వెంటకర మణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వేముల సుమలత, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:33 AM