Share News

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:30 AM

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు.

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

పెద్దపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జెండా చౌర స్తా వద్ద సోమ వారం నిర్వహించిన యుద్ధభేరి సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతోపాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలి పారు. గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేసి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. నిరు పేదలకు త్వరలోనే ఇంటి స్థలాలను కేటాయించి గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నా రు. జిల్లా కేంద్రంలో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు, ఆటోనగర్‌ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తున్నా మని ప్రకటించారు. రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరులో పెద్దపల్లి అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు ఎమ్మెల్యే విజయరమణారావు కృషి ఫలితమేనన్నారు. రూ. కోటితో జిల్లా కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టడీ కోచింగ్‌ సెంటర్‌ భవన నిర్మాణం, అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి, సుల్తానా బాద్‌, మంథని, రామగుండం మున్సి పాలిటీలపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గానికి

నిధుల వరద..: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దపల్లి నియోజకవర్గానికి నిధుల వరద పారుతున్నదని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణా రావు అన్నారు. నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపా యల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పెద్దపల్లి పట్టణా భివృద్ధికి రూ.92 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపా రు. మరో రూ.22 కోట్లు మంజూరు చేయించామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరిగెత్తిస్తున్నట్లు వివ రించారు. పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుక వస్తానన్నారు. ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా 36 మం ది కాంగ్రెస్‌ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎన్నికల ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, మాజీ ఎంపీపీ గోపగాని సార య్య గౌడ్‌, అభ్యర్థులు, పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 01:30 AM