మిల్లర్ల కుంభకోణంపై ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తాం
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:35 PM
రైస్‌మిల్లర్లు చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి తాము ఆధారాలతో సహా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యా దు చేస్తామని, దాంతో పాటు న్యాయ పోరా టం చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.
సుల్తానాబాద్, జూలై 31 ఆంద్రజ్యోతి): రైస్‌మిల్లర్లు చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి తాము ఆధారాలతో సహా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యా దు చేస్తామని, దాంతో పాటు న్యాయ పోరా టం చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. సుల్తా నాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రైస్ మిల్లర్లు, గోదాము నిర్వాహకులు చేసిన వందల కోట్ల అవినీతిని బయట పెడుతుంటే కొందరు మిల్లర్లు ఎందుకు ఉలిక్కిపడుతు న్నారని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజక వర్గంలో రైస్‌మిల్లుల్లో జరిగిన కుంభకోణా లపై విజిలెన్స్ విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ చేశారు. ఇటీవల రూ.700 కోట్ల హమాలీ చార్జీల కుం భకోణం పై తాను బయటపెట్టిన ఆధా రాలను చూసి గోదాం నిర్వాహకులు అధికా రులు రైస్‌మిల్లర్లలో వణుకు పుట్టిందన్నారు. ధాన్యం కొనుగోళ్ళ తీరులో చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉందని, ఎక్క డా కూడా సంచికి నలబై కిలో ల ఆరువందలు తూకం వేయ లేదని, కేవలం కోనుగోలు కేం ద్రాల ప్రారంభాల రోజు మాత్ర మే అది పరిమితమైందన్నారు. తాను అరోపణలు చేస్తున్న వాటన్నంటికీ ఆధారాలు ఉన్నా యని, తాము కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీని సీబీఐని కలు స్తామని చెప్పారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్,కొమ్మిది రాజేందర్ రెడ్డి,బండారి లత, వలస సాయి కిరణ్ పాల్గొన్నారు.