గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తాం
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:59 PM
గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న బస్‌లను నిలిపివేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట మీదుగా చొప్పదండి వరకు ఆర్టీసి బస్‌ను ప్రారంభించారు.
పెద్దపల్లి రూరల్/జూలపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలకు నడుస్తున్న బస్‌లను నిలిపివేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ సేవలను విస్తరింపజేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట మీదుగా చొప్పదండి వరకు ఆర్టీసి బస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుర్కలమద్దికుంటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆర్టీసీ బస్‌కు పూజలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి బస్‌ను ప్రారంభించారు. అనంతరం టిక్కెట్ తీసుకొని కాచాపూర్ వరకు ప్రయాణించారు. ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ డిపో దసరా నాటికి ప్రారంభం అవుతుందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగుకు వెనుకంజ వేసిన ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. సర్పంచ్ గోగు రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల నరేష్, ఉప సర్పంచ్ తిరుపతి, కాచాపూర్, వడుకాపూర్ సర్పంచులు పెంట కావేరి, పుల్లూరి ప్రశాంతి, గుర్రపు అంజయ్య, అంజినాయక్, ఓదెల శ్రీనివాస్, నాయకులు పుల్లూరి వేణుగోపాల్‌రావు, కన్నం రాంనారాయణ, జెట్టి సతీష్, వేల్పుల లింగయ్య, కనుకుంట్ల అంజయ్య, వేల్పుల గట్టయ్య, మాంకాలి తిరుపతి, ఆకుల లక్ష్మినారాయణ, రాజారాం, గుర్రం రాజయ్య పాల్గొన్నారు.