Share News

మున్సిపల్‌ సమగ్రాభివృద్ధికి చేయూతనందిస్తాం

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:27 AM

మంథని మున్సిపల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దటానికి, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు

మున్సిపల్‌ సమగ్రాభివృద్ధికి చేయూతనందిస్తాం

మంథని, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దటానికి, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో అన్ని వర్గాల ప్రజల ద్వారా ఒక వార్డు కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి సూచనలతో వార్డులో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనినీతి రహిత పాలన అందించాలని పాలక వర్గానికి సూచించారు. ఇటీవల కౌన్సిలర్లుగా గెలిచిన వారికి మోమొంటోలు ఇచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ మహిళులు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. వార్డుల్లో తాగునీరు, స్ట్రట్‌ లైట్స్‌, పారిశుధ్యం, మొక్కల పెంపకం, చలివేంద్రాల ఏర్పాటుతో పలు అంశాలపై చర్చించారు. కమిషనర్‌ ఎన్‌.మనోహర్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:27 AM