Share News

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - May 25 , 2026 | 11:31 PM

కొనుగోలు కేంద్రాలలో ఉన్న ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, ప్రతిపక్షాల ఉచ్చులో పడి రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. సుల్తానాబాద్‌ సహకార సంఘంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు.

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

సుల్తానాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలలో ఉన్న ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, ప్రతిపక్షాల ఉచ్చులో పడి రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. సుల్తానాబాద్‌ సహకార సంఘంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతు నియోజకవర్గంలో ధాన్యం కొను గోలు వేగవంతంగా నిర్వహిస్తున్నామని, వారం రోజుల నుంచి తాను ప్రతీ సెంటర్‌ను సందర్శించి కాంటా వేయించి, లారీలు మాట్లాడి మిల్లుకు పంపిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల ఇబ్బందుల ఉన్న మాట వాస్త వమే ఆయినా దాన్ని బూతద్దంలో చూడడం తగదన్నారు. పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ కొనుగోళ్ళను ఎలా నిర్వహించిందో రైతులకు తెలుసన్నారు. ఎన్ని కిలోల కటింగ్‌లు పెట్టారో మర్చిపోయి ఇతరులపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మేరకు మక్కలు కొనుగోలు చేసిందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, మరో ఐదారు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ధాన్యం తడిసినా మొలకలు వచ్చినా వాటిని కొని పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఏ మిల్లులో ధాన్యం కటింగ్‌ చేశారో ఆధారాలతో తనకు ఇస్తే సదరు మిల్లు నుంచి డబ్బులు ఇప్పిస్తా నని హామీ ఇచ్చారు. సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాదా క్రిష్ణ, పన్నాల రాములు, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, సీఈఓ బూరుగు సంతోష్‌, డైరక్టర్లు రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:31 PM