పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:27 AM
పత్తిపాక రిజర్వాయర్‌ను కట్టి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ధర్మపురి ఆలయంలో అభివృద్ధి పను లకు శంకుస్థాపన నిమిత్తం వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధర్మారం రోడ్‌లో పాల్గొనాల్సి ఉంది.
ధర్మారం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పత్తిపాక రిజర్వాయర్‌ను కట్టి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ధర్మపురి ఆలయంలో అభివృద్ధి పను లకు శంకుస్థాపన నిమిత్తం వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధర్మారం రోడ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆయన రాక ఆలస్యం అవుతున్న నేప థ్యంలో మంత్రి అడ్లూరి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమంలో గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్య లను మంత్రి ఖండించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే లక్ష్మీనర్సింహస్వామి ప్రాజెక్ట్ పేరుతో పత్తిపాక రిజర్వాయర్‌ను ఎందుకు నిర్మించలేదని విమ ర్శించారు. 10 యేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డయిన ఎం దుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని, డబుల్ బెడ్‌రూం పేరుతో ప్రజలను మోసం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తూ పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. తలా పున గోదావరి పెట్టుకొని ధర్మపురి నియోజకవర్గంలోని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ దొరలకు నీళ్ళు పంపారని ఎద్దేవా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్ల అభి వృద్ధి పనులను చేపట్టామని, అభివృద్ధి చెప్పడానికి తాము ఎప్పుడు సిద్ధమేనని పేర్కొన్నారు.