Share News

అణ్వాయుధాలు కాదు ప్రపంచ శాంతి కావాలి

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:54 PM

అణ్వాయుధాలు కాదని, ప్రపంచ శాంతి కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు. జాతీయ సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు.

అణ్వాయుధాలు కాదు ప్రపంచ శాంతి కావాలి

పెద్దపల్లిటౌన్‌, మార్చి 16 (ఆంఽధ్రజ్యోతి) అణ్వాయుధాలు కాదని, ప్రపంచ శాంతి కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు. జాతీయ సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఇరాన్‌ పై యుద్ధం ఆపాలని, యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. సదా నందం మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి వేలాది మందిని బలి తీసుకుంటున్నారని, యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు నష్టపోతారని, లక్షలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలు పరస్పర గౌరవం ఉంటుందన్నారు. అమెరికన్‌ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరే కంగా ప్రపంచంలోని కార్మిక వర్గం, సామ్రాజ్యవాద శక్తులు, శాంతి ప్రియులు ఐక్యంగా గళం వినిపించాలన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గౌతమ్‌ గోవర్ధన్‌. కే కనకరాజు. మణికొండ ఓదెమ్మ, మార్కాపూరి సూర్య, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:54 PM