Share News

మహిళలపై హింసను అరికట్టేందుకు ఉద్యమించాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:45 PM

మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్‌ బాడీ సమావేశం జరిగింది.

మహిళలపై హింసను   అరికట్టేందుకు ఉద్యమించాలి

జ్యోతినగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. జ్యోతి మాట్లాడుతూ దేశంలో మహిళలపై హింసలు, అత్యాచారాలు, హత్యలు, గృహహింసలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నా యని, వీటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో వేధింపులకు, అవమానాలకు గురవుతున్నారన్నారు. నేరాలకు పాల్పడే వారికి కఠిన చట్టాలు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, లేకుంటే పిఓడబ్ల్యు ఆధ్వ ర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షురాలిగా లక్ష్మి, ఉపాధ్యక్షులుగా సంధ్య, ప్రధాన కార్యదర్శిగా కవిత, సహాయ కార్యదర్శిగా రజిత, కోశాధికారిగా రాధ, ఆర్గనైజే షన్‌ కార్యదర్శులుగా శారద, మండమ్మ, విజయలక్ష్మి, భాగ్యమ్మ సభ్యులుగా రాయమల్లమ్మ, ఓదమ్మలను ఎన్నుకున్నారు. శంకర్‌, స్వామి, కొమురయ్య, రవి, పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:45 PM