డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:03 AM
డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగ స్వాములు కావాలని డీసీపీ రాంరెడ్డి పిలుపుని చ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగా హన ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగ స్వాములు కావాలని డీసీపీ రాంరెడ్డి పిలుపుని చ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగా హన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా చౌర స్తాలో మానవహారం ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ జి.కృష్ణ మాట్లాడుతూ దేశ భవి ష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో ఎద గాలని, గంజాయి, మద్యం, సిగరెట్లు, ఇతర మాదక ద్రవ్యాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల ను చదివించి వారి మంచి భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుం డా కుటుంబానికి, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. డ్రగ్స్, వినియోగం, విక్రయం, రవా ణాపై డయల్ 100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అం దించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామ న్నారు. జిల్లాలో విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని తెలి పారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానవ శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆరో గ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, ప్రజలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ నరేష్, రూరల్ ఎస్‌ఐ మధుకర్, ఎస్‌ఐ శ్వేతతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.