బీసీల హక్కుల సాధనకు ఏకంకావాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:39 PM
హక్కు ల సాధన కోసం బహుజన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంట లకు పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవనంలో బీసీల ఆత్మీ య సమావేశం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): హక్కు ల సాధన కోసం బహుజన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంట లకు పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవనంలో బీసీల ఆత్మీ య సమావేశం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్ర మానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు, ఏ రాజ కీయ పార్టీలో ఉన్నా సరైన ప్రాధాన్యం దక్కడం లదేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హక్కుల కోసం, రిజర్వే షన్ల సమర్థవంతమైన అమలు కోసం, విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్న మైందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా బీసీలకు రక్షణ కల్పించే చట్టాలు లేకపోవడం వల్ల అగ్రవర్ణాల దాడు లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్, నల్గొండ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. బీసీ బిడ్డలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ ప్రాంత సమస్యలను జాజుల శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీష్,వర్కింగ్ ప్రెసిడెం ట్ నల్లవెల్లి శంకర్,ముఖ్య నాయకులు బిక్షపతి, కె.రమేష్ రవి,ఆసరి రాజయ్య, అబ్దుల్ మాలిక్,శ్రావణ్,అజీమ్,రమేష్ పాల్గొన్నారు.