మహిళల హక్కుల రక్షణకు పోరాడాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:33 PM
అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం పురస్కరించుకొని గోదా వరిఖని శ్రామిక భవన్ ప్రాంగణంలో ఐద్వా, సీఐటీ యూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్‌ఐ, ఎస్ ఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.
కోల్‌సిటీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవం పురస్కరించుకొని గోదా వరిఖని శ్రామిక భవన్ ప్రాంగణంలో ఐద్వా, సీఐటీ యూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, డీవైఎఫ్‌ఐ, ఎస్ ఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాది, రాష్ట్ర మహిళ కన్వీనర్ సీహెచ్ శైలజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ దినోత్సవాన్ని పాలకులు దానిని ఒక వేడుక లాగా కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ నిర్వ హిస్తున్నారన్నారు. కానీ దాని వెనుక గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రస్తుత సమాజానికి భవిష్యత్తు తరాలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ పని ప్రదేశాల్లో మహిళలకు సరైన సదుపాయాలు భద్ర తలు లేకపోగా ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలకు మహిళ శత్రువు అనే విధంగా సీరి యల్స్ చిత్రీకరిస్తున్నారన్నారు. అంతరిక్షంలో అడుగు పెట్టడంతోపాటు ఆపరేషన్ సింధూర్‌లో మహిళలే కీలక పాత్ర పోషించి ప్రపంచానికి మహిళల ధైర్యాన్ని చాటారన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, డీవైఎఫ్‌ఐ గోదావరిఖని పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు అనూష, సృజన, మణెమ్మ మహిళలు పాల్గొన్నారు.