Share News

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:51 PM

మహనీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. ఆదివారం షెడ్యుల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలో నిర్వ హించిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి పాల్గొన్నారు.

మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): మహనీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. ఆదివారం షెడ్యుల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సమీపంలో నిర్వ హించిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన సభా ప్రాం గణంలో బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్‌ చిన్నతనంలో పాఠశాలలో అంట రానితనం సమస్యతో అనేక బాధలు అనుభవిం చారన్నారు. అతి చిన్న వయస్సులో కేంద్రమం త్రిగా, ఉప ప్రధానిగా పని చేశారన్నారు. స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారన్నారు. పలు హోదాల్లో మంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడి పిన వ్యక్తిగా దేశ చరిత్రలో నిలిచిపోయారని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం, రాజకీయ రంగం, సామాజికవేత్తగా జగ్జీవన్‌రామ్‌ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. వ్యవ సాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రోత్స హించారని, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారన్నారు. జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో మన మంతా సమాజానికి సేవచేస్తూ మంచి పేరు తీసుకురావాలని కోరారు. అంతకుముందు పలు సంఘాల ప్రతినిధులు, నాయకులు మాట్లాడు తూ ఆయన సేవలను గుర్తుకు చేశారు. ఆర్డీఓ గంగయ్య, సురేష్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌, పలు ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి ప్రభుత్వ విప్‌ విజయరమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మున్సిపల్‌ చైర్మన్‌, పట్టణ కౌన్సిలర్లు, దళిత సం ఘాల నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 11:51 PM