డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:57 PM
డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, అందుకు సహకారం అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం బొమ్మరెడ్డిపల్లి శివారు ఓ ఫంక్షన్ హాల్‌లో ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమా నికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పత్తుపదార్ధాల వాడకం వల్ల యువత చెడుమార్గంలో నడుస్తుందని, వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
ధర్మారం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, అందుకు సహకారం అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం బొమ్మరెడ్డిపల్లి శివారు ఓ ఫంక్షన్ హాల్‌లో ‘మిషన్ పరివర్తన’ కార్యక్రమా నికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. పత్తుపదార్ధాల వాడకం వల్ల యువత చెడుమార్గంలో నడుస్తుందని, వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకొని వాటికి అనుగుణంగా రాణించాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. నషా ముక్త్ కార్యక్రమం ముఖ్యమం త్రి చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమని డీసీపీ రాంరెడ్డి నాయక్ అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్ధాలు, హింసా వంటి విషయాలకు యువ కులు దూరంగా ఉండాలని సూచించారు. మూడు గంటలు అధిక సం ఖ్యలో మహిళలు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. ఎస్‌పీ నాయక్ ఆధ్యర్యంలోని సాంసృతిక కళా బృందానికి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం కళాకరులకు ప్రోత్సహకంగా ఒక్కొక్కరికి 12,500 చొప్పున నగదు బహుమతిగా పోలీసులు అందజేశారు. ఎస్‌ఐ ఎంబడి శ్రీకాంత్‌తో పాటు పోలీసులకు అభినందనలు తెలిపారు. ఏసీపీ జీ.కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీఓ సుమలత, సర్పంచ్‌లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
మండల కేంద్రంలోని సర్వే నంబర్ 476లో పెండింగ్‌లో ఉన్న మినీ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు తెలిపారు. ఎంపీడీఓ కార్యలయంలో 108 మంది లబ్దిదారులకు 37 లక్షల 58 వేల విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మేడారం గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లను శుభ్రపరిచేందుకు 10 లక్షలతో సర్పంచ్ వీర్‌పాల్ తీసుకున్న బేడ్ ట్రాక్టర్‌ను మంత్రి ప్రారంభించారు.