జలసిరి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:31 PM
గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు జలసిరి పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సంద ర్శించి అధికారులతో సమావేశమయ్యారు.
సుల్తానాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు జలసిరి పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సంద ర్శించి అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా పంట కుంటల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వీబీజీరామ్‌జీ పథకం కింద పనులు చేసేందుకు ఆసక్తి చూపుతూ జాబ్ కార్డులు లేని వారికి వెంటనే కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో కొత్తగా మంజూరైన విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఎంపీడీవో నీలగిరి దివ్యదర్శన్ రావు, ఎంపీఓ మౌలిక, కార్యాలయ పర్య వేక్షకులు ఫక్రుద్దీన్, ఏపీవో మల్లీశ్వరి, ఉపాధి హామీ జేఈ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.