యుఐడీఎఫ్ నిఽధులతో నీటి సరఫరా మెరుగు
ABN , Publish Date - May 24 , 2026 | 12:01 AM
యుఐడిఎఫ్ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆయన సమీక్షించారు.
కోల్‌సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): యుఐడిఎఫ్ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నీటి సరఫరా అభివృద్ధి పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించే ఎనిమిది ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లకు స్థలం గుర్తిం చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సహకారంతో ఆయా సంస్థల ఉన్నతాధికారులతో సంప్రదించి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకొంటామన్నారు. పికె రామయ్యకాలనీ లాంటి ప్రాంతాల్లో ఈల్‌ఎస్‌ఆర్ నిర్మించినట్లయితే లింగాపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా 76 కిలోమీటర్ల మేర డిస్ర్టిబ్యూషన్ పైప్ లైన్ నెట్‌వర్క్ నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లీకేజీలు కాకుండా నాణ్యతతో డిఐ పైప్‌లైన్ వేసినట్లయితే ఎక్కువ కాలం మన్నికగా ఉండే అవకాశాలు ఉన్నందున ఆ దిశగా ఆలోచన చేయాలని మేయర్ అన్నారు. నగర పాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, డీఇ నరసింహస్వామి, జగదీశ్వర్, మనోజ్, మౌనిక, కోయ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి రావత్ పాల్గొన్నారు.