నీటిని పొదుపుగా వాడాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:49 PM
రానున్న వేసవి కాలంలో ఎదురయ్యే నీటి ఎద్దడి, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపుగా వాడాలని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం గోదావరినది తీరంలోని ఇన్‌టేక్‌వెల్ ప్రాంగణంలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులో జీఎం పాల్గొన్నారు.
గోదావరిఖని, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రానున్న వేసవి కాలంలో ఎదురయ్యే నీటి ఎద్దడి, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని పొదుపుగా వాడాలని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం గోదావరినది తీరంలోని ఇన్‌టేక్‌వెల్ ప్రాంగణంలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులో జీఎం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, వేసవిని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిఖని ప్రాంత దాహార్తిని తీర్చే ప్రధాన వనరు గోదావరి నదే అయినందున, వేసవిలో నీటి కొరత తలెత్తకుండా రోజు 15 నిమిషాలు నీటిని తక్కువ విడుదల చేస్తామన్నారు. ఇప్పటి నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలన్నారు. నీరు వృథా కాకుండా సరైన సమయానికి పంపులు, వాల్వ్‌లను నియంత్రించడంలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం నీటి పొదుపుపై ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు, పిల్లలకు వివరించి చైతన్యవంతం చేయాలని జీఎం కోరారు. కెడీఎన్ వరప్రసాద్, ఎస్‌ఓటూ జీఎం చంద్రశేఖర్, ఏరియా పర్యావరణ అధికారి వేణు, డిప్యూటీ ఎస్ఈ (సివిల్)రాజు, ఈఈ ప్రణీత్, ఏఐటీయూసీ ప్రతినిధి వెంకటేశ్వర్లు, అధికారులు ప్రవీణ్, అజయ్ నూనె శ్రీనివాస్ పాల్గొన్నారు.