Share News

మక్కల నిలువకు గోదాములు సిద్ధం

ABN , Publish Date - May 12 , 2026 | 11:59 PM

జిల్లాలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వకు గోదాములను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. రంగాపూర్‌లో 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం గల గోదాం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ రంగా పూర్‌లో గోదాములను, అప్పన్నపేటలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు.

మక్కల నిలువకు గోదాములు సిద్ధం

పెద్దపల్లి రూరల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వకు గోదాములను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. రంగాపూర్‌లో 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం గల గోదాం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ రంగా పూర్‌లో గోదాములను, అప్పన్నపేటలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. బుధవారం నుంచి రంగాపూర్‌ గోదాంకు మొక్కజొన్న తరలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మక్కల కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.

పాలకుర్తి (ఆంధ్రజ్యోతి): కన్నాలలో గల గణపతి ఇండస్ట్రీస్‌ను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించి మక్కల నిల్వ సామర్ధ్యం, అందుబాటులో ఉన్న సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, తహసీ ల్దార్‌ సునీత, డీటీఎస్‌ మహేష్‌, రవీందర్‌ ఉన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:59 PM