Share News

వార్డు మెంబర్లకు సముచిత స్థానం కల్పించాలి

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:01 AM

వార్డు సభ్యులకు తగిన గుర్తింపు కల్పిచాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. పెద్దపల్లి, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీలు అశోక్‌, సంతోష్‌ కుమార్‌, పెద్దపల్లి మండల అధ్యక్షుడు తిరుపతి తదితరులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వార్డు మెంబర్లకు సముచిత స్థానం కల్పించాలి

పెద్దపల్లి టౌన్‌, నవంబరు23(ఆంధ్రజ్యోతి): వార్డు సభ్యులకు తగిన గుర్తింపు కల్పిచాలని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. పెద్దపల్లి, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జీలు అశోక్‌, సంతోష్‌ కుమార్‌, పెద్దపల్లి మండల అధ్యక్షుడు తిరుపతి తదితరులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు సభ్యునికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, వారి కుటుంబాలకు హెల్త్‌కార్డులు జారీ చేయాలని, పదవీ కాలంలో మరణించిన వార్డు సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డు సభ్యు ల పేర్లను ముద్రించాలని కోరారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సొసైటీల మార్పుతో రైతులకు ఇబ్బందులు

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి): తుర్కలమద్దికుం టలో పీఏసీఎస్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా మని, అయితే దాని పరిధిలోకి ఇతర గ్రామాలను చేర్చ డంపై అభ్యంతరం చేస్తున్నామని రైతులు తెలిపారు. పెద్దకల్వల, నిట్టూరు, నిమ్మనపల్లి, పెద్దబొంకూరు, దస్త గిరిపల్లె, కొత్తపల్లి గ్రామాలను మద్దికుంట సొసైటీలో విలీనం చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదుర వుతాయని కలెక్టర్‌తో పాటు జిల్లా సహకార అధికారి శ్రీమాలకు వినతిపత్రం అందజేశారు. రైతుల సౌకార్య ర్ధాం పెద్దకల్వలలో ప్రత్యేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సలేంద్ర రాములు యాదవ్‌, నార్ల అంజయ్య, సంపత్‌, కొమురయ్య, పర్స సమ్మయ్య, పాల్గొన్నారు.

మట్టి తరలింపుపై...

పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): ఎలుకలపల్లి నుండి కన్నా ల వరకు నిర్మిస్తున్న డబుల్‌రోడ్డు పనుల్లో భాగంగా రాణాపూర్‌ ఐకేపీ సెంటర్‌ సమీపంలోని సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వవద్దని రాణాపూర్‌ సర్పంచ్‌ ఇటుకాల స్రవంతి శ్రీకాంత్‌ కోరా రు. తహసీల్దార్‌ సుధాటి కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

పాత బిల్లులు చెల్లించాలి

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన 2019 నుంచి పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పం చ్‌ గొల్ల కావేరి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బిల్లులు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చెల్లించకపోవ డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సం బంధించిన పెండింగ్‌ బిల్లులను పరిశీలించి నిధులు విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Nov 24 , 2026 | 12:01 AM