Share News

బొగ్గుగని కార్మికులకు వేజ్‌బోర్డు అమలు చేయాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:18 AM

ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న బొగ్గుగని కార్మికులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే 12 వేజ్‌బోర్డును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న దేశ వ్యాప్తంగా అన్నీ బొగ్గు గనుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జాతీయ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజిరెడ్డి, గడ్డం కృష్ణ చెప్పారు.

బొగ్గుగని కార్మికులకు  వేజ్‌బోర్డు అమలు చేయాలి

గోదావరిఖని, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న బొగ్గుగని కార్మికులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే 12 వేజ్‌బోర్డును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న దేశ వ్యాప్తంగా అన్నీ బొగ్గు గనుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జాతీయ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజిరెడ్డి, గడ్డం కృష్ణ చెప్పారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బొగ్గుపరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు జూలై 1 నుంచి 12వ వేజ్‌బోర్డు కాలపరిమితి మొద లైందని, కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో 51శాతం ఓట్లు ఏ సంఘానికి రాకుంటే అధికారులే కమిషన్‌ ఏర్పాటు చేసి వారికి నచ్చిన ట్టుగా వేతనాల పెంపు చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో కార్మికవర్గం అన్యాయానికి గురవుతుందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా సోమవారం అన్నీ జీఎం కార్యాలయాల ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య, కవ్వంపల్లి స్వామి, గౌతం గోవర్ధన్‌, దాసరి శ్రీనివాస్‌, దేవయ్య, రమేష్‌, శివరాంరెడ్డి, రాజమౌళి, నరహరి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:18 AM