ఓట్ల తొలగింపు అనైతిక చర్య
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:16 AM
ఓట్ బచావో ..దేశ్ బచావోలో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో నవంబరు 1న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చెప్పారు.
పెద్దపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓట్ బచావో ..దేశ్ బచావోలో భాగంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో నవంబరు 1న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు, డీసీసీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చెప్పారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెద్దపల్లిలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సర్ పరిశీలకులు శరత్, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ పరిశీలకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ పేరుతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్ కుమార్ అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని, దేశంలో 13 కోట్లు, రాష్ట్రంలో కూడా 70 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఓట్ల తొలగింపు అనేది అనైతిక చర్య అని అన్నారు. ఓటు అనేది దేశ పౌరుని హక్కు అని ఓటును తొలగించే హక్కు ఎవ్వరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం 1న నిర్వహించే ర్యాలీకి పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివెళ్లనున్నట్లు వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏ నియోజకవర్గానికి ఎన్ని నీళ్లు వచ్చాయో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ చెప్పాలని ప్రభుత్వ విప్ అన్నారు. రామగుండం మేయర్ మహాంకాళి స్వామి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పాల్గొన్నారు.