ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:40 PM
ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రసాదరావు అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో బీఎల్‌ఓలు ఓటర్లకు ప్రత్యేక నమోదు ఫారాలను అందించారు.
అంతర్గాం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ప్రసాదరావు అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో బీఎల్‌ఓలు ఓటర్లకు ప్రత్యేక నమోదు ఫారాలను అందించారు. ఆయన పలు గ్రామాల్లో పర్యటించి ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పరిశీలించి, పలువురికి ఫారాలను అందించారు. సర్పంచ్‌లు రవినాయక్, గాదె మాధవి, అరుముల్ల మాధవి, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్యగౌడ్, ఎస్‌ఐఆర్ ఇంచార్జి గాదె సుధాకర్, బీఎల్‌ఏ చింతల ప్రసన్న, వార్డు సభ్యులు శ్రీకాంత్, బాణాల బుజ్జి బాబు, అధ్యక్షుడు ఒల్లెపు స్వామి, సాధనల మోహన్‌రావు, నూతి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.