Share News

రంగాపూర్‌ గోదాంల సందర్శన

ABN , Publish Date - May 19 , 2026 | 11:53 PM

జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వ కోసం ప్రస్తుతం అందు బాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగా పూర్‌లో గల గోదాంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

రంగాపూర్‌ గోదాంల సందర్శన

పెద్దపల్లి రూరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వ కోసం ప్రస్తుతం అందు బాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగా పూర్‌లో గల గోదాంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ రంగా పూర్‌లో గల ధాన్యం గోదాములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి జిల్లాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి రంగాపూర్‌ ఐజి గోదాంకు మక్కల తరలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిల్వ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగి నంత హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి రైతులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. గోదాముల వద్ద సౌకర్యాలు కల్పించి నిల్వ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:54 PM