మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:49 PM
సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఇటుక బట్టీలకు వెళ్తున్న మట్టి టిప్పర్‌లు అధిక లోడ్‌లతో వస్తున్నాయని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్ టిప్పర్ ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఇటుక బట్టీలకు వెళ్తున్న మట్టి టిప్పర్‌లు అధిక లోడ్‌లతో వస్తున్నాయని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్ టిప్పర్ ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో సుమా రు మూడు గంటల పాటు మట్టి టిప్పర్‌లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. సర్పంచ్ మాట్లాడుతూ సోమవారం మట్టి టిప్పర్ అధిక స్పీడ్‌తో వచ్చి ఆటోను ఢీ కొట్టిందని, అధిక లోడ్‌తో రహదారి దెబ్బతింటుందన్నారు. టిప్పర్‌ల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంత మొరపెట్టుకుం టున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా నిమ్మనపల్లి మీదుగా మట్టి టిప్పర్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎస్‌ఐ మల్లేష్, సీఐ ప్రవీణ్‌కుమార్ చొరవతో అందోళన విరమించారు. నాయ కులు తంగెడ రాజేశ్వర్‌రావు, మేకల శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.