కూరగాయల సాగుకు ప్రణాళిక
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:44 PM
జిల్లాలో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేం ద్రం రామగిరిఖిల్లాలు సంయుక్తంగా 13వ శాస్ర్తీయ సలహా మండలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
రామగిరి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేం ద్రం రామగిరిఖిల్లాలు సంయుక్తంగా 13వ శాస్ర్తీయ సలహా మండలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ప్రస్తుత సంవ త్సరం నిర్వహించిన సాంకేతిక కార్యక్ర మాలపై శాస్త్రవేత్తలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉప కులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడు తూ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారం దిశగా అడుగు వేయాలని సూచించారు. రైతులు వర్షాకాలంలో జీలుగ, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె ఎరువులు వేసి దున్నాలన్నారు. తద్వారా నేల ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ప్రాథమిక సహకార సం ఘాల ద్వారా అభ్యుదయ రైతుల చేత కూరగాయల సాగును పెంచే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలన్నారు. విశ్వ విద్యాలయం రిజిస్టర్ డాక్టర్ భగవాన్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం అంది స్తున్న సేవలను గురించి తెలుపుతూ శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలను రైతులు విని యోగించుకోవాలన్నారు. విస్తరణ సంచా లకులు డాక్టర్ సురేష్‌కుమార్‌రెడ్డి మాట్లా డుతూ రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొం టున్న సమస్యలపై శాస్త్రవేత్తలు అందుబా టులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవ సాయ అధికారులు, వ్యవసాయ పరిశోధన కూనారం శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని పరిశీలించిన వీసీ
పన్నూరు పంచాయతీ పరిధిలోని కొండా లక్ష్మన్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వీసీ రాజిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులు తయా రు చేసిన ఎండిన పూల రెక్కలతో ఆకర్షణీ యమైన కీచైన్లను పరిశీలించి అభినందిం చారు. చదువుతోపాటు వృత్తి నైపుణ్యాలను నేర్పిస్తున్నందుకు వైస్ ప్రిన్సిపాల్ ప్రణీత్‌కు మార్‌ను అభినందించారు. వెదురుతో బోకే లు, పండ్లు, పువ్వుల నుంచి హోలీ రంగుల తయారీపై వీసీ హర్షం వ్యక్తంచేశారు.