అకాల వర్షం... తడిసిన ధాన్యం
ABN , Publish Date - May 25 , 2026 | 11:36 PM
మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధ్యానం తడిసిపోయింది. పత్తిపాక కొనుగోలు కేంద్రంలో సోమవారం సాయంత్రం వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ధాన్యంపై కవర్లు కప్పే సమయం కూడా రైతులకు లభించలేదు.
ధర్మారం, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధ్యానం తడిసిపోయింది. పత్తిపాక కొనుగోలు కేంద్రంలో సోమవారం సాయంత్రం వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ధాన్యంపై కవర్లు కప్పే సమయం కూడా రైతులకు లభించలేదు. దీంతో ఆరబెట్టిన ధాన్యంతోపాటు, ధాన్యపు బస్తాలు తడసి పోయాయి. తీవ్రమైన గాలి వానతో పత్తిపాక ఎక్స్‌రోడ్ సమీపంలో చెట్లు నేలకొరగగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. చొప్పదండి నుండి ధర్మారం మండలంలోని పత్తిపాక వరకు భారీ వర్షం కురియడంతో మిగత సెంటర్ల రైతులకు వర్షపు ముప్పు తప్పింది.
గాలి దుమారానికి నేలకొరిగిన ట్రాన్స్‌ఫార్మర్
ఎలిగేడు, మే25(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాములపల్లి బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ గాలి ఉధృతికి నేల కొరిగింది. ట్రాన్స్‌ఫార్మర్ గద్దెపై నుంచి కిందపడడంతో దానికి ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఆ సమయంలో అటుగా ఎవరు ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈదురుగాలులకు లేచిన ఇంటి పైకప్పు
కాల్వశ్రీరాంపూర్, మే25(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం ఈదురుగాలులతోపాటు అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మల్యాలలో ఈదురుగాలులకు గుమ్మనవేన రాజయ్య ఇంటిపైకప్పు లేచిపోయింది. రోహిణి కార్తె ప్రారంభమై సందర్భంగా కురిసిన చిరుజల్లులకు కొనుగోలు కేంద్రాల్లోని వరి, మొక్కజొన్న పోసిన రైతులు ఆందోళన గురై తడవకుండా ముందు జాగ్రత్తగా చర్యగా టార్ఫాలిన్ కప్పారు.