Share News

అన్‌లోడింగ్‌ వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 08 , 2026 | 11:32 PM

ధాన్యం కొను గోలు కేంద్రాల నుంచి ఆయా రైస్‌మిల్లులకు వస్తున్న లారీలలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే ట్రక్‌ షీట్లను జనరేట్‌ చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రైస్‌మిల్లర్లను ఆదేశిం చారు.

అన్‌లోడింగ్‌ వేగవంతంగా పూర్తి చేయాలి

సుల్తానాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొను గోలు కేంద్రాల నుంచి ఆయా రైస్‌మిల్లులకు వస్తున్న లారీలలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే ట్రక్‌ షీట్లను జనరేట్‌ చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రైస్‌మిల్లర్లను ఆదేశిం చారు. సుద్దాలలో జైహన్‌మాన్‌ రైస్‌మిల్లు, పూసాల పరి ధి కనక మహాలక్మి రైస్‌మిల్లు, సుగ్లాంపల్లి లక్ష్మీభవాని రైస్‌మిల్లులను కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ గురించి ఆరా తీశారు. లారీ లు మిల్లుల వద్ద ఉండడాన్ని ఆయన ప్రశ్నిస్తూ దిగు మతి ప్రక్రియను వెంటనే పూర్తిచేసి లారీలను ఆయా కేంద్రాలకు పంపించాలన్నారు. రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు వారి ఖాతాలలో పడడానికి ఆయా లారీల ట్రక్‌షీట్లను కంప్యూటర్లలో నమోదు చేయించాల న్నారు. రైస్‌మిల్లర్లు రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో ఎలాంటి కోతలు కటింగ్‌ విధించవద్దన్నారు.

రేగడిమద్దికుంట తదితర గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే కొనుగోళ్లను వేగ వంతం చేయాలని, వెంట వెంటనే మిల్లులకు తరలిం చాలన్నారు. కేంద్రాలలో అవసరమైనన్ని బ్యాగులు అం దుబాటులో ఉంచాలని, వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్‌ కవర్లు ఇచ్చేందుకు నిలువ ఉంచు కోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్‌తో పాటు పలువురు రైస్‌ మిల్లర్లు ఉన్నారు.

కొనుగోలులో ఇబ్బందులు కలిగించవద్దు

కాల్వశ్రీరాంపూర్‌, (ఆంధ్రజ్యోతి): వరి, మొక్కజొన్న కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలి గించవద్దని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. కాల్వశ్రీరాం పూర్‌, కూనారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సం దర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. కాంటాలు సవ్యంగా సాగుతున్నాయని, లారీల కొరత కారణంగా ఇబ్బందులు ఉన్నాయని ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కొరత లేకుండా చూస్తానని తెలిపారు. గన్ని బ్యాగులు, టార్ఫాలిన్‌ రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మిల్లర్లు కూడా కోత లేకుండా ధాన్యం తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్‌ బంగారి రమేష్‌, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, డీఎంఓ ప్రవీణ్‌ రెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 11:32 PM