కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:56 PM
నీట్ ప్రశ్నపత్రం లీక్, ఎస్‌ఎస్‌సీజీడీ పరీక్ష నిర్వహ ణలో లోపాలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మార్కుల గోల్‌మాల్‌ను నిరసిస్తూ ఎన్‌ఎస్ యూఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశా రు.
కోల్‌సిటీటౌన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్నపత్రం లీక్, ఎస్‌ఎస్‌సీజీడీ పరీక్ష నిర్వహ ణలో లోపాలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మార్కుల గోల్‌మాల్‌ను నిరసిస్తూ ఎన్‌ఎస్ యూఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్‌రాజ్ మాట్లాడుతూ దేశ భవిష్య త్తు అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమ ర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా లక్ష లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశ లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ బాధ్యులపై కఠినచర్యలు తీసుకోకపో వడం వల్లే మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసు కున్నాయని ఆరోపించారు. సీబీఎస్‌ఈ 12వ తర గతి పరీక్షల అనంతరం మార్కుల కేటాయిం పులో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరో పించారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఇతరుల ఆన్సర్ షీట్లు, సరైన సమాధానాలకు తక్కువ మార్కులు, ఖాళీ జవా బు పత్రాలు కనిపించడం విద్యార్థులను ఆందో ళనకు గురిచేశాయన్నారు. సాంకేతిక లోపాల కారణంగా సీబీఎస్‌ఈ పోర్టల్ పని చేయకపోవడం సమస్యలను మరింత పెం చిందని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీజీడీ-2026 పరీక్ష నిర్వహణలో నూ తీవ్ర లోపాలు ఉన్నాయని, నార్మలైజేషన్ విధానం సక్ర మంగా అమలు కాకపోవడం వల్ల విద్యా ర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిం చారు. పరీక్ష కేంద్రాల సమాచారం ఆలస్యంగా ఇవ్వడం, నిర్ణీత సమయానికి పరీక్షలు ప్రారం భం కాకపోవడం, పోర్టల్ సాంకేతిక సమస్యలు, కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గోంతి వంశీకృష్ణ, లావుడియా సాయితేజ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, పార్టీ సీని యర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.