పుష్కరాల్లో నిరంతరాయంగా విద్యుత్ సేవలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:04 AM
గోదావరినది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. గోదావరినది తీరంలోని పుష్కర ఘాట్‌లను బుధవారం ఆయన పరిశీలించారు.
మంథని, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గోదావరినది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. గోదావరినది తీరంలోని పుష్కర ఘాట్‌లను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ భద్రతకు ప్రాధ్యాన్యం ఇస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందు కోసం ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇటీవల చార్జి చేసిన దుబ్బపల్లిలోని సోలార్ పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. సమర్థవంతంగా నిర్వహణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.