Share News

మహిళ కడుపులో నుంచి కణితి తొలగింపు

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:51 PM

గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం వైద్యులు ఆపరే షన్‌ చేసి మహిళ కడుపులోంచి కణితి తొలగించారు. ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్‌ బొగ్గుగనిలో పని చేసే తిరుపతి అనే ఉద్యోగి భార్య సుమలత ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం సింగరేణి ఏరియా ఆసుప త్రిలో చేరింది.

మహిళ కడుపులో నుంచి కణితి తొలగింపు

గోదావరిఖని, మార్చి 21 (ఆంధ్ర జ్యోతి): గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం వైద్యులు ఆపరే షన్‌ చేసి మహిళ కడుపులోంచి కణితి తొలగించారు. ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్‌ బొగ్గుగనిలో పని చేసే తిరుపతి అనే ఉద్యోగి భార్య సుమలత ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం సింగరేణి ఏరియా ఆసుప త్రిలో చేరింది. గైనకాలజిస్ట్‌ ఇందిర పరీక్షలు నిర్వహించి ఆమె కడుపులో 4.5కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం అడిషనల్‌ సీఎంవో అంబిక పర్యవేక్షణలో ఆపరేషన్‌ నిర్వ హించి కణితిని తొలగించారు. క్లిష్టమైన ఆపరే షన్‌ నిర్వహించడంలో వైద్యులు మద్దిలేటి వినోద్‌కుమార్‌, శ్యామల, పారామెడికల్‌ బృందం కుసుమ స్వరూప, విద్యరాణి, అశోక్‌, రాములు సహకారం అందించారు. వైద్యులను, వైద్య సిబ్బందిని సింగరేణి సీఎంఓ కిరణ్‌ రాజ్‌కు మార్‌, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌ అభినం దించారు.

Updated Date - Mar 21 , 2026 | 11:51 PM