Share News

విద్యుత్‌ అమరవీరులకు నివాళి

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:02 AM

విద్యుత్‌ అమరుల వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీఎం ఏరియా కమి టీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడిపల్లి సెంటర్‌లో విద్యుత్‌ అమ రుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్యుత్‌ అమరవీరులకు నివాళి

జ్యోతినగర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ అమరుల వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీఎం ఏరియా కమి టీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడిపల్లి సెంటర్‌లో విద్యుత్‌ అమ రుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు నామిని భిక్షపతి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలు చేస్తే విచక్ష ణారహితంగా కాల్పులు జరపగా రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి, బాల స్వామి అమరులయ్యారన్నారు. వారి ఆత్మశాంతి కోసం నివాళు లర్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా స్మార్ట్‌ మీటర్లు పెట్టి బడుగు బలహీనవర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యు త్‌ను తొలగించే కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్‌ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, దండ రాఘవారెడ్డి, కాదాసి మల్లేష్‌, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా విప్లవ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల్లో అమరులైన వారిని స్మరించుకుంటూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. గాంధీనగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయం లో అమరుల చిత్రపటానికి పూలమాలలు వేశారు. న్యూడెమో క్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్‌, రామకృష్ణ, అశోక్‌, మల్లేష్‌, రాజన్న, కొమురయ్య, మల్లేశం, శేఖర్‌, ప్రసాద్‌, ప్రభాకర్‌, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:02 AM