Share News

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:45 PM

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించా లని అన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

పెద్దపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించా లని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాం గ్రెస్‌ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా లబ్ధిదా రుల ఎంపిక, అర్హతలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, పెం డింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలపై చర్చిం చారు. విజయరమణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతీ నిరుపేద కుటుం బానికి సొంతింటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతోందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఆర్థికంగా వెనుకబడిన వారు, సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ సభ్యులకు సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితు లను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా అర్హత లను నిర్ధారించాలని చెప్పారు. రాజకీయాలు, వ్యక్తిగత సిఫార్సులు, ఒత్తిళ్లకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు సమన్వ యంతో అనర్హులకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రక్రియను పారదర్శ కంగా నిర్వహించాలని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపికపై అభి ప్రాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

Updated Date - Oct 04 , 2026 | 11:45 PM